పోలవరం ముంపుపై ఉమ్మడి సర్వే
పోలవరం బ్యాక్‌వాటర్ సమస్యపై మరోసారి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 9లోగా ఇవ్వాలని తెలంగాణకు సూచించింది. ఈ సర్వేకు పూర్తిగా సహకరిస్తామని, అన్ని రక్షణ చర్యలు చేపడతామని ఏపీ అధికారులు తెలిపారు. పోలవరం బ్యాక్‌వాటర్ సమస్యపై శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ఇరిగేషన్ అధికారులు
- తెలంగాణ డిమాండ్‌కు అంగీకారం
- 4 రాష్ట్రాలతో కేంద్ర జలశక్తిశాఖ భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): పోలవరం బ్యాక్‌వాటర్ సమస్యపై మరోసారి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 9లోగా ఇవ్వాలని తెలంగాణకు సూచించింది. ఈ సర్వేకు పూర్తిగా సహకరిస్తామని, అన్ని రక్షణ చర్యలు చేపడతామని ఏపీ అధికారులు తెలిపారు. పోలవరం బ్యాక్‌వాటర్ సమస్యపై శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ఇరిగేషన్ అధికారులు, సాంకేతిక నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ అధికారులు మాట్లాడుతూ.. వాస్తవిక వరదలకు, సీడబ్ల్యూసీ రూపొందించిన అంచనాలకు మధ్య వ్యత్యాసం ఉన్నదని వివరించారు. బ్యాక్‌వాటర్ ప్రభావంపై మరోసారి అధ్యయనం చేయాలని కోరారు. 2022లో వచ్చిన వరదల వల్ల 103 గ్రామాలు, 11,000 కుటుంబాలు, 28,000 మం ది వ్యక్తులు ముంపు బారినపడినట్టు తెలిపారు. పోలవరం డ్యామ్‌లో ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో నీరు నిల్వ చేసినప్పుడు, నిర్వహించినప్పుడు నిలబడి ఉన్న నీటి వల్ల కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని వాదించారు.
డ్రైనేజీ రద్దీ, మునిగిపోవడం వల్ల దాదాపు 150 గ్రామాల్లోని 50 వేల ఎకరాలు ప్రభావితమవుతాయని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ ఉమ్మడి సర్వేకు అంగీకరించింది. సమావేశంలో తొలుత ఛత్తీస్‌గఢ్ అధికారులు మాట్లాడుతూ.. వివిధ అధ్యయనాలు పోలవరం వద్ద గరిష్ఠంగా 58 లక్షల క్యూసెకుల వరద ప్రవాహం ఉంటుందని చెప్తున్నాయని, ఆ మేరకు డిజైన్, బ్యాక్‌వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. ఒడిశా కూడా ఇదే డిమాండ్ వినిపించింది. దీనిపై ఉమ్మడిగా సమగ్ర అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, అంతవరకు పోలవరం ప్రాజెక్టుకు అంగీకరించేది లేదని ఒడిశా స్పష్టం చేసింది. కేంద్రజల్‌శక్తిశాఖ, ఏపీ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఏపీకి మాత్రమే అనుకూలంగా ఉన్నదని వాదించింది. అయితే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలను కేంద్ర జలశక్తిశాఖ తిరస్కరించింది. కేవలం 36 లక్షల క్యూసెక్కుల వరద సామర్థ్యం మేరకే పరిగణనలోనికి తీసుకుంటామని తెలిపింది. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే గుప్తా, పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, తెలంగాణ నుంచి ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ సుబ్రమణ్యం ప్రసాద్, రాకేశ్రౌతు, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబుతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CWC
- Drown
- Jal Shakti
- joint survey
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

