ఉచిత విద్యుత్ పథకం అమలుపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
ఉచిత విద్యుత్ | రాష్ర్టంలోని నాయి బ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం

హైదరాబాద్ : రాష్ర్టంలోని నాయి బ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు.
ఈ పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది ధరఖాస్తు చేసుకున్నట్లు సీఎస్ వెల్లడించారు. ఇందులో 10,637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17,913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుండి వచ్చాయన్నారు. అయితే ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని ఆదేశించారు. లబ్ధిదారులు తమ ధరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటీ అధికారులను ఆదేశించారు. సీజీజీలో నమోదు చేసుకున్న దరఖాస్తులను వెంటనే సంబంధిత డిస్కంలకు పంపించాలని ఆదేశించారు. తద్వారా ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు, TSSPDCL, CMD రఘుమారెడ్డి, బీసీ వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ సైదా, వాషర్ మెన్ ఎండీ చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ్ ఎంసీ విమలతో పాటు తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

