హైదరాబాద్ : బేరియం స్టాల్ వినియోగించి తయారుచేసిన పటాకులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన హోంశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో బాణాసంచా క్రయ విక్రయాలపై సమీక్ష నిర్వహించారు. బేరియం సాల్ట్ వాడిన పటాకులపై గతంలో సుప్రీం కోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఇటీవల ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు విధించిన నిషేధం గురించి సీఎస్.. అధికారులకు వివరించారు. బేరియంతో చేసిన పటాకులు నిషేధమని, రాష్ట్రంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను తప్పక అమలు చేయాలన్నారు. బేరియం వాడిన పటాకులు తయారు చేయొద్దని, విక్రయించొద్దని వ్యాపారులను ఆదేశించారు.