యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసంతోపాటు ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీఐపీ దర్శనానికి 3 గంటలు, ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
కార్తిక మాస వ్రతాలు, దీపారాధనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని 40 వేల మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.64,67,273 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.
– యాదగిరిగుట్ట