OPS | కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలుపుకోవాలి.. ధర్నా చౌక్ కేంద్రంగా మార్చి 2న యుద్ధభేరి
OPS | ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు.
OPS | ఖమ్మం అర్బన్ : ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ జిల్లాలోని పలు పాఠశాలలు,ప్రభుత్వ కార్యాలయాలలో యుద్దభేరి గోడపత్రికలు ఆవిష్కరించారు.
పాత పెన్షన్‌ను పునరుద్ధరించడం మినహా మరే ఇతర విధానాలు ఉద్యోగి హక్కులను కాపాడలేవని, సామాజిక భద్రతను కల్పించలేవని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని యన డిమాండ్ చేశారు. 2004లో నూతన పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత.. సీపీఎస్ఈయు దేశవ్యాప్తంగా చేసిన ఉద్యమాల ఫలితంగా అనేక రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించబడింది. అదేవిధంగా తెలంగాణలో కూడా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ ధర్నా చౌక్‌లో మార్చి 2న తలపెట్టిన యుద్ధభేరి కార్యక్రమం మలిదశ పెన్షన్ పోరాటానికి ఆరంభం మాత్రమేనని శశిధర్ అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ పాత పెన్షన్ పునరుద్ధరించుకుంటామని స్పష్టం చేశారు. పాత పెన్షన్ సాధనా పోరాటంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుండి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాగి సురేష్, జిల్లా కోశాధికారి గుగులోత్ మోహన్, జిల్లా ఈసీ సభ్యులు కమటం నాగేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

