కరువు నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలి డిప్యూటీ సీఎంకు సీపీఎం ప్రతినిధుల విజ్ఞప్తి
రాష్ట్రంలో కరువు నివారణ ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరువు నివారణ ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీపీఎం తరఫున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన 365 కరువు మండలాల్లో నష్టపోయిన వాణిజ్య పంటలకు రూ.50వేలు, ఇతర పంటలకు రూ.30వేల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
రూ.2లక్షలలోపు అన్ని రకాల పంట రుణాలను తక్షణమే మాఫీ చేయాలని విన్నవించారు. ఆహార భద్రత, ఉచిత రేషన్ కిట్ ధరల నియంత్రణ పాటించాలని సూచించారు. బియ్యం, నిత్యావసరాల అక్రమ నిల్వలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీల పరిధిలో పేదలు, వృద్ధుల కోసం ఉచిత రాగి జావ, మజ్జిగ పంచే “భోజన కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు.
వలసలను నివారించడానికి ఉపాధిహామీ పని దినాలను 200రోజులకు పెంచాలని కోరారు. పశువులు, పక్షులు, ఇతర జంతువుల దాహార్తిని తీర్చడానికి గ్రామాల్లో తాగునీటి తొట్లు, ఉచిత పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు ప్రతిపాదనలతో కూడిన లేఖను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

