మత కల్లోలాలకు మోదీ కుట్ర
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తెరపైకి తీసుకొస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ఆరోపించారు.
- అందుకే ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ప్రయత్నం
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తెరపైకి తీసుకొస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ఆరోపించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూసీసీతోపాటు వస్తు, సేవల పన్నును వ్యతిరేకించిన మోదీ.. ప్రధాని అయ్యాక ఆ రెండింటినీ సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మగ్దూంభవన్‌లో మాట్లాడుతూ.. ఒక దేశంలో రెండు చట్టాలు ఎలా ఉంటాయని వాదిస్తున్న బీజేపీ నేతలకు అసలు దేశం ఎలా ఆవిర్భవించిందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలంతా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాడారని.. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాటంలో బీజేపీ పాల్గొనలేదని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలోని అన్ని మతాలు, కులాలు, సంసృతులు, సంప్రదాయలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని తెలిపారు. వీటన్నింటినీ మరిచిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకమైన కుయుక్తులు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు మరో రకమైన కుట్రలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నదని నిప్పులు చెరిగారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి శృంగభంగమైనా మోదీకి బుద్ధి రాలేదని, అందుకే రాజకీయ ప్రయోజనాల కోసం యూసీసీని తీసుకొస్తామంటూ మతాల మధ్య విద్వేషాన్ని నింపుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి పౌర సృ్మతికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ, సీపీఎం కూటమిగానే ఉన్నాయని, ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీచేస్తాయని స్పష్టం చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యవర్గ సభ్యులు ఎన్ బాలమల్లేశ్, ఈటీ నరసింహ కూడా పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

