హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించి అక్రమ వ్యాపారాలు చేస్తూ థాయిలాండ్‌లో పోలీసులకు పట్టుబడిన చీకోటి ప్రవీణ్‌ను దేశ బహిషరణ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. దేశ గౌరవ మర్యాదలు దెబ్బతీసే చీటర్ ప్రవీణ్‌కు సహకరిస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. చీకోటి ప్రవీణ్ మనదేశం నుంచి తీసుకెళ్లిన వారితో థాయ్‌లాండ్‌లో క్యాసినో గేమ్ ఆడించి.. 100 మందితో పట్టుబడ్డాడని చెప్పారు. అతని అక్రమ వ్యాపారాలకు కొందరు బీజేపీ నేతలు సహకరిస్తున్నారని విమర్శించారు. గతంలో గుడివా డ, హైదరాబాద్‌లో కూడా క్యాసినో గేమ్ ఆడించి ఏపీ, తెలంగాణ ప్రతిష్ఠను చీకోటి దిగజార్చాడని ధ్వ జమెత్తారు. నిందితుల పూర్తి వివరాలను ప్రభుత్వాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.