గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారు : డీ రాజా
D Raja | తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా
హైదరాబాద్ : తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా రాష్ట్రాల పాలనలో జోక్యం చేసుకుంటున్నారు. ఇది సరైంది కాదని పేర్కొన్నారు. హైదరాబాద్ డీ రాజా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను లూటి చేస్తు కార్పొరేట్ శక్తులకు అమ్ముతుందని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 2014 ఎన్నికల సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని మోదీ నెరవేర్చలేకపోయారని నిప్పులు చెరిగారు. మోదీ విధానాల వలన రూపాయి విలువ పతనమైందన్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలు చేయడంతో రాష్ట్రాలకు నిధులు రావడం లేదన్నారు. ప్రాంతీయ, జాతీయ పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. 2024లో మోదీని గద్దె దింపుతామన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాజా పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

