2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం వినాశనమే : డీ రాజా
D Raja | గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ, అమిత్ షా
హైదరాబాద్ : గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ, అమిత్ షా ప్రసంగాలను పరిశీలిస్తే, ఆ నేతల్లో నిరాశ, భయాందోళనలు కనబడుతున్నాయన్నారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం వినాశనమవుతుందని రాజా పేర్కొన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన తర్వాత డీ రాజా హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు అధ్యక్షతన మగ్దూం భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి డీ రాజా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయన్నది ఉత్కంఠగా మారిందన్నారు. త్వరలో జరిగే త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలో కొనసాగితే దేశ వినాశనం తప్పదని హెచ్చరించారు. కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తానని తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, అందుకు భిన్నంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ నిరంకుశ విధానాలను అమలు పరుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని వినాశనం దిశగా తీసుకుపోతున్నారని మండిపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థలను పరిరక్షించుకోవాలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలయికను 2024 ఎన్నికల్లో తప్పక ఓడించాలని రాజా పిలుపునిచ్చారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఫాసిస్టు శక్తులను ఏకాకిని చేసి 2024 ఎన్నికల్లో ఓడించాలని, ఇందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, శక్తులు, ప్రాంతీయ పార్టీల ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని రాజా చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే రాజకీయ అవగాహనతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. జీవనోపాధి సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించడం ద్వారా కమ్యూనిస్టు పార్టీని శక్తివంతం చేయాలని పార్టీ శ్రేణులకు రాజా పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

