RRR Oscar | నల్లగొండ : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఆర్ఆర్ఆర్( RRR ) చిత్ర బృందానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukhender Reddy ) శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట( Naatu Naatu Song )కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్( Oscar Award ) రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణమని ఆయన అన్నారు.
నాటు నాటు పాట రచయిత చంద్రబోస్( Chandrabose ), పాటపాడిన రాహుల్ సిప్లిగంజ్( Rahul ), కాలభైరవ, సంగీతం అందించిన ఎంఎం కీరవాణి( MM Keeravani ), చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ), హీరోలు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ), రామ్ చరణ్( Ram Charan )లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇంకా మంచి చిత్రాలను నిర్మిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో నిలబెట్టాలని ఆయన సూచించారు.