నల్లగొండ : అమెరికాలోని మేరీల్యాండ్‌లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్పు . మృతదేహం తరలించడంపై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు.