Corrupt Congress | కరప్ట్ కాంగ్రెస్ మోడల్.. కరెక్ట్ బీఆర్ఎస్ మోడల్.. హైదరాబాద్ కూడళ్లలో వెలసిన పోస్టర్లు
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరుపై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను పోల్చుతూ ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి.
హైదరాబాద్: హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరుపై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను పోల్చుతూ ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి. ‘కరప్ట్ కాంగ్రెస్ మోడల్.. కరెక్ట్ బీఆర్ఎస్ మోడల్’ అంటూ పలువురు వాల్‌పోస్టర్లు అంటించారు. రైతు బీమా, ఉచిత కరెంటు, వికలాంగుల పింఛన్లు, దళితబంధు, రైతు బంధు వంటి సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌కు తెలంగాణకు మధ్య ఉన్న వ్యత్యాన్ని వాటిలో వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలకు, ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేదని నిరూపించారు.
- తెలంగాణలో దళితులకు ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు ఇస్తుండగా, హస్తం పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో గుండు సున్నా అని వెల్లడించారు.

- దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఛత్తీస్‌గఢ్‌లో రూ. 500, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.1300, కర్ణాటకలో రూ. 1100, రాజస్థాన్‌లో రూ. 1250 ఇస్తుండగా.. తెలంగాణలో మాత్రం రూ.4116గా ఉందని తెలిపారు.

- వృద్ధాప్య పింఛన్.. ఛత్తీస్‌గఢ్ రూ.500, హిమాచల్‌ప్రదేశ్ రూ.750-1250, కర్ణాటక రూ.1000, రాజస్థాన్‌లో రూ.1000-1250 ఇస్తున్నారని, అదే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2016 ఇస్తున్నదని పేర్కొన్నారు.

- ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో రైతు బీమా పథకమే లేదనీ, తెలంగాణలో రైతు చనిపోతే అతని కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తుందన్నారు.

- రైతు బంధు పేరుతో రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణలో ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తుండగా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో ఒక్క రూపాయి కూడా ఆర్థికసాయం చేయడం లేదన్నారు.
- ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇస్తున్నదని, అదే ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా.. కరెంట్ కోతలతో సతమతం చేస్తున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- Corrupt Congress
- CWC
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

