కరోనా బారిన పడ్డ మావోయిస్టులు వీరే.. ఎలా సోకిందంటే..?
కరోనా | దండకారణ్యంలో కరోనా అలజడి రేపుతోంది. అడవుల్లో ఉండే అన్నలను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. పదుల సంఖ్యంలో మావోయిస్టులు కరోనా బారిన

వరంగల్ : దండకారణ్యంలో కరోనా అలజడి రేపుతోంది. అడవుల్లో ఉండే అన్నలను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. పదుల సంఖ్యంలో మావోయిస్టులు కరోనా బారిన పడ్డారు. దండకారణ్య స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, కొరియర్ బందుగ వినయ్ నిన్న వరంగల్ పోలీసులకు పట్టుబడటంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గడ్డం మధుకర్‌కు కరోనా సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం.. కొరియర్ సాయంతో వరంగల్‌కు వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ములుగు క్రాస్ రోడ్డు వద్ద మధుకర్‌తో పాటు వినయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కరోనా బారిన పడ్డ మావోయిస్టులకు కొవిడ్ చికిత్స చేయించుకునేందుకు అగ్ర నాయకులు అనుమతి ఇవ్వడం లేదని మధుకర్ తెలిపాడు. మొత్తంగా కరోనాతో 12 మంది మావోయిస్టులు కరోనాతో పోరాటం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
- కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్
- తిప్పరి తిరుతి అలియాస్ దేవుజీ
- యాప నారాయణ అలియాస్ హరిభూషణ్
- బడే చొక్కారావు అలియాస్ దామోదర్
- కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న
- కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్స్
- ములా దేవేంద్రరెడ్డి అలియాస్ మాస దడ
- కున్‌కటి వెంకటయ్య అలియాస్ వికాస్
- ముచ్చకి ఉజల్ అలియాస్ రఘు
- కొడి మంజుల అలియాస్ నిర్మల
- పూసం పద్మ
- కాకర్ల సునీత అలియాస్ బుర్రా
మావోయిస్టులకు కొవిడ్ ఎలా సోకింది?
గత పదిరోజుల క్రితం బీజాపూర్ సిల్దూర్ గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ ఛత్తీస్గడ్, తెలంగాణ రాష్ర్ట సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలతో మావోయిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో కొవిడ్ లక్షణాలున్న ప్రజలను మావోయిస్టు నాయకులు, సభ్యులు కలవడంతో వారికి కరోనా సోకినట్లు తేలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

