కరోనాను కంట్రోల్ చేశాం : మంత్రి కేటీఆర్
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ముందు వరుసలో

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు.
సనత్‌నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు 7 అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్‌లను మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ విరాళంగా ఇచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహీంద్రా గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషమని అన్నారు. భవిష్యత్‌లో మహీంద్రా గ్రూప్ మరిన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మహీంద్రా గ్రూప్ తెలంగాణలో ఒకరంగానికే పరిమితం కాలేదు. జహీరాబాద్‌లో లక్ష పైచిలుకు ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తుంది. హైదరాబాద్‌లో టెక్ మహీంద్రా హెడ్ క్వార్టర్స్ ఉంది. వరంగల్‌లో కూడా వారి కార్యకలాపాలను విస్తరించారు. ప్రయివేటు యూనివర్సిటీల్లో భాగంగా తెలంగాణలో మహీంద్రా యూనివర్సిటీని నెలకొల్పడం జరిగింది. ఇలా ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా ఉంటుంది. ఇవాళ ఏడు అంబులెన్స్‌లు, రూ. కోటి విలువైన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

