పరీక్షలు డబుల్!

- రోజూ 1.20 లక్షల మందికి కరోనా టెస్టులు
- 50 శాతానికి పెరుగనున్న ఆర్టీపీసీఆర్
- కోటి 11లక్షలు దాటిన టెస్టుల సంఖ్య
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. రెండు వారాల క్రితం వరకు రోజు 60 వేల పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1.20 లక్షలకు పెంచింది. త్వరలో 1.50 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి 11 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించింది. వీరిలో 3.32లక్షల మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, 80.8శాతం మందిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదు. వైరస్ సోకిన వారిని ముందుగా గుర్తించడం వల్ల వారిని ప్రమాదం నుంచి కాపాడటంతోపాటు, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం సాధ్యమవుతుంది. దీంతో ప్రభుత్వం ఆర్టీపీసీఆర్కు తోడు, ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నది. 20 ప్రభుత్వ, 60 ప్రైవేటు దవాఖానల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతుండగా, 1,064 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న 30 శాతం దాకా ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఉండగా, ఈ సంఖ్యను 50శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అన్ని జిల్లా దవాఖానల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona
- Corona tests
- rtpcr
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

