బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 00:45:55

స్వీయరక్షణతోనే కరోనా కట్టడి

స్వీయరక్షణతోనే కరోనా కట్టడి

  • జూన్‌, జూలైలో కేసులు పెరిగే అవకాశం
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌/సిద్దిపేట కలెక్టరేట్‌: స్వీయ రక్షణతోనే కరోనాను కట్టడి చేయొచ్చని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట, గజ్వేల్‌లో మంత్రి పర్యటించారు. గజ్వేల్‌లో విశ్రాంత ఉద్యోగుల భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. లాక్‌డౌన్‌ ఎత్తివేతతో కరోనా పోయిందని భావించొద్దని, వ్యాధి లక్షణాలు అనేక రకాలుగా బయట పడుతున్నాయని తెలిపారు.  ఆరో విడుత హరితహారంలో పెద్దసంఖ్యలో మొక్కలు నాటి ఊరూవాడ పచ్చని వనాలుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సిద్దిపేటలోని 4, 9, 13వ వార్డుల్లో పట్టణ ప్రగతి లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, బాలవికాస, మున్సిపల్‌, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్‌ బ్యాంకులను ప్రారంభించారు. సమీకృత మార్కెట్‌ను తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo