హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లను www.tseamcet.tsche.cgg.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు జేఎన్టీయూ అధికారులు సూచించారు. మే 10 నుంచి 15 వరకు ఎంసెట్ నిర్వహించ నున్నారు.
10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్, 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ వి ద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. కాగా, ఆలస్య రుసుముతో విద్యార్థులు మంగళవారం వరకు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ తెలిపారు.