వేగంగా రోడ్ల నిర్మాణాలు

- శరవేగంగా సచివాలయ నిర్మాణం
- లాక్డౌన్ వేళ.. ఆర్అండ్బీ యోచన
హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసే అలోచనలో అధికారులున్నారు. లాక్‌డౌన్‌తో ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోతారు. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అవసరమైతే ప్రత్యేక పర్మిషన్లు తీసుకొని నిర్మాణ పనులు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నిర్మాణ ప్రాంతాల్లోనే కూలీలు గుడారాలు వేసుకొని ఉంటున్నారు. వారికి కావాల్సిన రేషన్ సిద్ధంగానే ఉన్నది. ఆంక్షల సడలింపు సమయంలో కూరగాయలు, ఇతరత్రా కొనుక్కొనేందుకు అవకాశముంటుంది. మిగతా సమయమంతా సైట్లోనే ఉంటారు కనుక పనులు వేగంగా పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు
నిరాటంకంగా సచివాలయం నిర్మాణ పనులు
సచివాలయం నిర్మాణ పనులు కూడా నిరాటంకంగా కొనసాగించనున్నారు. ఇప్పటికే కావాల్సిన మెటీరియల్‌ను నిర్మాణ ప్రాంతానికి తెప్పించుకున్నారు. కార్మికులు కూడా సైట్లోనే ఉన్నారు. వారితో పనులు సాఫీగా చేయనున్నారు. దీంతో సచివాలయ నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అధికారులు భావిస్తున్నారు. ఉన్న సామగ్రితో పనులు చేస్తామని, లాక్డౌన్ నిబంధనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈఎన్సీ గణపతిరెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

