ఒకే కాంప్లెక్స్‌లో భరోసా, సఖి, ఓల్డ్ ఏజ్ హోమ్‌ల నిర్మాణం : మత్రి హరీశ్‌రావు
సిద్దిపేట : సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్‌లో భరోసా, సఖీ, ఓల్డ్ ఏజ్ హోమ్ ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ అవరణలో రూ.48.69 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భవనం, సికింద్రాబాద్‌కు చెందిన గౌరా పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మహిళలు, బాలల భరోసా సెంటర్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రస్తుతం భరోసా కేంద్రం, సఖి కేంద్రాలు సిద్దిపేట పట్టణంలో వేర్వేరు చోట ఉండడం వల్ల బాధితులకు సేవలు అందించడం, సమన్వయం చేసుకోవడంలో కొంత మేర సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు.

అధికారుల పర్యవేక్షణ కొరవడుతుందని మంత్రి తెలిపారు. భరోసా, సఖి కేంద్రాలతో పాటు కొత్తగా కోటి రూపాయలతో మంజూరు చేసుకున్న ఓల్డ్ ఏజ్ హోమ్ ను సైతం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఒకే కాంప్లెక్స్ పరిధిలో నిర్మించడంతో బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.
తమ సమస్యలను ఎవరికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయే మహిళలకు, బాలలకు భరోసా కేంద్రం ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. మహిళలు, బాలల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు న్యాయ సహాయం భరోసా కేంద్రం ద్వారా అందుతుందన్నారు. బాధితులకు కౌన్సిలింగ్ అందించి తమ కాళ్ల మీద తాము నిలబడేలా సఖి, భరోసా కేంద్రాలు సహాయాన్ని అందిస్తాయని మంత్రి తెలిపారు.
మహిళలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు సఖి కేంద్రం వన్ స్టాప్ సెంటర్‌గా ఉంటుందన్నారు.
ఓకే కాంప్లెక్స్ లో వీటి నిర్మాణం చేపట్టడం వల్ల ఉమ్మడి వసతులను కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ కేంద్రాలు ఉండడం వల్ల బాధితులకు రక్షణతో పాటు సపోర్టు అందుతుందన్నారు. వీటి నిర్మాణ పనులను వెంటనే చేపట్టి సాధ్యమైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సీపీ ఎన్ శ్వేత, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల, జిల్లా సంక్షేమ అధికారి రామ్ గోపాల్ రెడ్డి, గౌరా పెట్రో కేమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ప్రసాద్, శ్రీనివాస్,
స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

