Telangana | తెలంగాణలో కొత్తగా ఆరు రైల్వే లైన్లు.. త్వరలో పనులు ప్రారంభం!
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆ ధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 6 మేజర్ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది. అందుకోసం రూ.26,000 కోట్ల వ్యయం అవుతుందని రైల్వే అధికారులు అంచనాలు సిద్ధంచేశారు.
- పాండురంగాపురం-మల్కాన్‌గిరి మధ్య అంతర్రాష్ట్ర లైన్
- డోర్నకల్-గద్వాల మధ్య 296 కిలోమీటర్ల మార్గం
- డోర్నకల్-మిర్యాలగూడ మధ్య 105 కి.మీ రైల్వేలైన్
- కాచిగూడ-జగ్గయ్యపేట, రామగుండం-మణుగూరు
- మధ్య కొత్త మార్గాలకు రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్
- ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.26 వేల కోట్లు
- త్వరలో ప్రారంభం కానున్న నిర్మాణ పనులు
Telangana | హైదరాబాద్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆ ధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 6 మేజర్ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది. అందుకోసం రూ.26,000 కోట్ల వ్యయం అవుతుందని రైల్వే అధికారులు అంచనాలు సిద్ధంచేశారు. కొత్త ప్రాజెక్టులో భాగంగా భద్రాచలం-మల్కాన్‌గిరి రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైల్వే మార్గం నిర్మించబోతున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ లైన్ దూరం 170 కిలోమీటర్లు గా ఉంటుంది. అందులో ఏపీలో 85.55 కిలోమీటర్లు ఉండగా, తెలంగాణలో 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మిగతాది ఒడిశాలో ఉండనున్నది. ఈ ప్రాజెక్టు ని ర్మాణం కోసం రూ.7,383 కోట్ల వ్యయా న్ని అంచనా వేశారు. వచ్చే రెండు నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం న్యూఢిల్లీ నుంచి వర్చువల్ ద్వారా మీడియాతో మాట్లాడారు.పాండురంగాపురం – భద్రాచలం-మల్కన్‌గిరి ప్రాంతాల మధ్య నూతన రైల్వే లైను ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని వెల్లడించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ నుంచి ఎస్సీఆర్ జీఎం అరుణ్‌కుమార్‌జైన్, సీపీఆర్వో శ్రీధర్ పాల్గొన్నారు.
ఇతర రైల్వే లైన్లు ఇవీ..
- డోర్నకల్-గద్వాల మధ్య 296 కిలోమీటర్ల దూరం నూతన రైల్వే లైను నిర్మాణాన్ని త్వరలో చేపట్టబోతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
- డోర్నకల్-మిర్యాలగూడ మధ్య 105 కిలోమీటర్ల మేరకు నూతన రైల్వే లైనును నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,100 కోట్లగా అంచనా వేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
- కాచిగూడ(ఉందానగర్)-జగ్గయ్యపేట ప్రాంతాలను కలిపి నూతన రైల్వే మార్గం నిర్మాణం కాబోతున్నది. ఇది నేషనల్ హైవే 65 అంటే హైదరాబాద్-విజయవాడ రహాదారికి సమాంతరంగా నూతన రైల్వే మార్గం. 228 కిలోమీటర్ల పొడువు ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.4,600 కోట్లు డీపీఆర్‌లో ప్రతిపాదించారు.
- రామగుండం-మణుగూరు ప్రాంతాలను కలుపుతూ 207 కిలోమీటర్ల మేరకు నూతన రైల్వే మార్గం నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. రెండు, మూడు నెలల్లో తుది అనుమతులు మంజురు కానున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.4,100 కోట్లుగా అంచనా వేశారు.
- నాగులపల్లి-నిజామాబాద్-ఆదిలాబాద్ ప్రాంతాలను కలుపుతూ మరో నూతన రైల్వే మార్గం ప్రాజెక్టుకు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనున్న ది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దాదాపు 316 కిలోమీటర్ల మేర నూతన రైలు మా ర్గం నిర్మాణం కాబోతున్నది. ఇందుకు రూ.6,400 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

