Constable Gajula Soumya | గంజాయి ముఠా దాడికి బలైన సౌమ్య..నిమ్స్‌లో చికిత్సపొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి
గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎ క్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (23) మృతి చెం దారు. ఎనిమిదిరోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు శనివారం రాత్రి కన్నుమూశారు.
- నిమ్స్‌లో చికిత్సపొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి
వినాయక్‌నగర్, జనవరి 31: గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎ క్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (23) మృతి చెం దారు. ఎనిమిదిరోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు శనివారం రాత్రి కన్నుమూశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సౌమ్య జనవరి 23న గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు మాధవ్‌నగర్ వద్ద మాటువేశారు. గంజాయి తో వస్తున్న కారును ఆపి తనిఖీలు చేసేందుకు ప్రయత్నించగా, కారులో ఉన్న వ్యక్తులు ఆమెను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన సౌమ్యను తొలుత నిజామాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి విషమిస్తుండటంతో 25వ తేదీన హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూఆ శనివారం రాత్రి 9.45 గంటలకు మృతి చెందారు. ఆమె మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం మోస్రాలో సౌమ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

