జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ ఆపార్టీ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చెలరేగుతున్నారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లా మహాదేవపూర్‌లో(Mahadevpur) కాంగ్రెస్ జెడ్పీటీసీ(Congress ZPTC) భర్త గుడాల శ్రీనివాస్ ఆగడాలు మితిమీరుతున్నాయి.
ఏకంగా పోలీస్ స్టేషన్లో(Police station) డ్యాన్సులు(Dances) వేస్తూ వీడియో చిత్రీకరించడం సంచలనం రేపుతున్నది. పోలీస్ స్టేషన్‌ను డ్యాన్స్ క్లబ్‌గా మార్చి మన్మధుడు సినిమా పాటకి స్టెప్పులేస్తూ ఆడిపాడాడు. అంతేకాదు ప్రభుత్వ అధికారులు తాను చెప్పినట్టు నడుచుకుంటారని స్నేహితులకు వీడియో శ్రీనివాస్ వీడియో పంపారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు(Viral video) కొడుతున్నది. బాధ్యతగా మెలగాల్సిన వ్యక్తి పోలీస్ స్టేషన్ డ్యాన్స్ క్లబ్‌గా మార్చారని స్థానికులు మండిపడున్నారు. అలాగే పోలీసుల పేరు చెప్పి శ్రీనివాస్ ఇసుక క్వారీల్లోనూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారం అండ చూసుకొని అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని మహదేవ్పూర్ వాసులు కోరుతున్నారు.