సొంత పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు
సొంత పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు | కాంగ్రెస్ పార్టీ వ్యవహర శైలిపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపైనా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపైనా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ పదవి ఎలా ఇస్తారంటూ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉందా.? లేదా.? అని ఆయన నిలదీశారు. తాను రేవంత్ రెడ్డిని తిట్టలేదని, రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయని మాత్రమే చెప్పానని అన్నారు. ఇవాళ నన్ను తిట్టారు.. రేపు ఇంకొకరిని తిడతారని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎక్కువయ్యారని, కోవర్టులు ఉన్నన్ని రోజులు పార్టీ బాగుపడదని మండిపడ్డారు.
హైకమాండ్‌కు లేఖలు రాసిరాసి అలిసిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పి చేసి ఉంటే చెప్పండి పార్టీ నుంచి తప్పుకుంటానని అన్నారు. తనకు పార్టీలో అవమానాలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. ‘‘సోనియా గాంధీ బలిదేవత అన్నవాళ్లే ఇప్పుడు ఆమెకు దగ్గరయ్యారు. సీనియర్లు, జూనియర్లు కలిస్తేనే పార్టీ. రేవంత్ పెద్ద నాయకుడు అంటారు, గ్రేటర్లో ఎన్ని సీట్లు గెలిపించాడని నిలదీశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే గాంధీ భవన్‌కు కూడా ఎవ్వరినీ రానివ్వడు. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ జైలుకు వెళ్తే ఎలా.? పార్టీ జైలు చుట్టూ తిరగాలా’’.! అని ఘాటుగా విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

