పీసీసీ చీఫ్ రేవంత్‌పై కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు
Bhatti Vikramarka | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని సీనియర్లు ఎత్తుకున్నారు. పార్టీని నాశనం చేసే కుట్ర
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని సీనియర్లు ఎత్తుకున్నారు. పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని సీనియర్లు మండిపడుతున్నారు. అసలు కాంగ్రెస్ తామేనని సీనియర్లు ప్రకటించుకున్నారు.
పీసీసీ కమిటీల తీరుపై భట్టి విక్రమార్క ఇంట్లో మధుయాష్కీ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం జరుగుతుండగా భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేశారు. మేమంతా మీ వెంటే ఉంటామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వలస వచ్చిన నేతలతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. ఈ ఎపిసోడ్లో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో పుట్టి, పెరిగి.. భావజాలం నమ్మిన అనేక మందికి కమిటీల ఏర్పాటులో నష్టం జరిగింది. తనను చాలా మంది పర్సనల్‌గా వచ్చి కలుస్తున్నారని పేర్కొన్నారు. అసలైన కాంగ్రెస్ నాయకులకు నష్టం జరగడంతో తాను కూడా మనస్తాపానికి గురయ్యాను అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

