Vikarabad | తహసీల్దార్ కార్యాలయంలో కొట్టుకున్న కాంగ్రెస్ రియల్టర్లు
వికారాబాద్ నియోజకవర్గంలో ఓ భూమి విషయంలో Congress leaders కొట్టుకున్నారు. మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో సర్వే నెంబర్ 461, 462లలోని ఇనామ్ భూమి.. అదే గ్రామానికి చెందిన మోహన్‌తోపాటు మరికొందరి పేరుమీద ఉంది.
- మర్పల్లి మండలం సిరిపురంలోని ఇనామ్ భూమి విషయంలో దాడి
Vikarabad | వికారాబాద్, జూలై 19, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ నియోజకవర్గంలో ఓ భూమి విషయంలో Congress leaders కొట్టుకున్నారు. మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో సర్వే నెంబర్ 461, 462లలోని ఇనామ్ భూమి.. అదే గ్రామానికి చెందిన మోహన్‌తోపాటు మరికొందరి పేరుమీద ఉంది. ఈ భూమి పంచనామా విషయంలో శుక్రవారం మోహన్‌ను వెంటబెట్టుకొని కాం గ్రెస్ నాయకులు చిన్న మైసగళ్ల నర్సింలు మర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో సిరిపురం గ్రామానికి చెందిన మరో కాంగ్రెస్ నాయకుడు మాణిక్యరావు అలియాస్ మల్లేశంతోపాటు తుమ్మలపల్లికి చెందిన దొడ్ల జయరాజ్ కలిసి ఈ భూమి పంచనామా విషయమై ఆర్ఐతో మాట్లాడుతున్నారు.
అక్కడే ఉన్న నర్సింలు వర్గీయులు కలుగజేసుకొని ‘మాగ్రామానికి సంబంధించిన భూముల గురించి నీకేం అవసరం’ అంటూ తుమ్మలపల్లికి చెందిన జయరాజ్‌పై దాడి చేశాడు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తహసీల్దార్ కార్యాలయంలోనే కొట్టుకున్నారు. ఈ దాడిలో మాణిక్యరావు తలకు గాయం కావడంతో మర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్న వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

