Komatireddy Venkat Reddy | చెరకు సుధాకర్‌ను మా వాళ్లు వారంలో చంపేస్తరు.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వార్నింగ్
Komatireddy Venkat Reddy | వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌ను తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Komatireddy Venkat Reddy | నల్లగొండ ప్రతినిధి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌ను తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఇలా ఉన్నది. ‘మీ నాన్న వీడియో చూసినవా? ఇప్పటికే నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజుల నుంచి ఓపిక పడుతున్నా. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను విమర్శిస్తాడా? వాడిని వదిలేది లేదు. వాడు (చెరుకు సుధాకర్) క్షమాపణ చెప్పకపోతే మా వాళ్లు చంపుతరు. నా అభిమానులు వంద కార్లల్లో బయల్దేరారు. ఇంటి పార్టీ ఏందిరా? వాడు పీడీ యాక్ట్ కేసులో జైల్లో పడితే నేను ఒక్కడినే వెళ్లి పరామర్శించిన. కౌన్సిలర్‌గా గెలవనోడు నన్ను విమర్శిస్తాడా? 25 ఏండ్ల నా రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించిన. వారిలో చాలామంది ఇప్పటికే వాడి మీద కోపంతో చంపుతామంటూ బయల్దేరారు. నేను ఎంతమందినని ఆపుతా. నిన్ను కూడా చంపేస్తరు. నీ హాస్పిటల్ ఉండదు. వారంలో వాడిని చంపేస్తారు’ అని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఇపుడు ఈ ఆడియో జిల్లావాప్తంగా కలకలం రేపుతున్నది.
కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం
ఇటీవల పలుమార్లు కోమటిరెడ్డిని విమర్శిస్తూ చెరుకు సుధాకర్ వ్యాఖ్యలు చేయడమే ఈ వివాదానికి కారణమని తెలిసింది. కొద్దిరోజుల కిందట చెరుకు సుధాకర్ ఓ చానల్‌తో మాట్లాడుతూ సీడబ్ల్యూసీలో అవకాశం ఇస్తే మరింత బాగా పనిచేస్తానంటూ వెంకట్‌రెడ్డి చెప్పిన మాటలపై విమర్శలు చేశారు. వెంకట్‌రెడ్డి పార్టీలో సీనియర్ కావచ్చు, పార్టీ కోసం పనిచేసేందుకు పదవి అవసరమా? అని వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ముందు విశ్వసనీయత నిరూపించుకోవాలని, సీడబ్ల్యూసీని అడిగే ముందు ఆయన దక్షిణ తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం గట్టిగా పనిచేసి విశ్వసనీయత పొంది వెంకట్‌రెడ్డికి సీడబ్ల్యూసీ దక్కితే తానే మొదట ఆయనకు దండ వేస్తానన్న చెరుకు సుధాకర్ వ్యాఖ్యలే కోమటిరెడ్డికి ఆగ్రహం కలిగించాయని సమాచారం. నకిరేకల్ నియోజకవర్గంలో తనకు తెలువకుండా చెరుకు సుధాకర్ పార్టీ కార్యక్రమాలు చేస్తుండటం ఆగ్రహానికి మరో కారణంగా తెలుస్తున్నది.
అధిష్ఠానం దృష్టికి ఆడియో
ఎంపీ కోమటిరెడ్డి ఫోన్లో తన కుమారుడు సుహాస్‌ను బెదిరించడంపై చెరుకు సుధాకర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ఏ క్షమాపణలు కూడా సరిపోవని అన్నారు. ఈ ఆడియోను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించానని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. ఎంపీ మతి ఉండి మాట్లాడుతుండో, మతి లేక మాట్లాడుతుండో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై అధిష్ఠానమే చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రజల దృష్టిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే డకౌట్ అయిన వికెట్ అని ఎద్దేవా చేశారు.

ఎంపీ కోమటిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు కోమటిరెడ్డి నుంచి ప్రాణభయం ఉన్నదని, రక్షణ కల్పించి ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కాగా, చెరుకు సుధాకర్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన కోమటిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఐతగోని జనార్దన్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలో ఎంపీ వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

