బెల్లంపల్లి, అక్టోబర్ 5: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఆశావహ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ బుధవారం రాత్రి తన మొబైల్ ఫోన్ నుంచి మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో న్యూడ్ వీడియోలను పోస్టు చేసి ఛీత్కారాలకు గురయ్యారు. ఈ వీడియోలను చూసిన సదరు గ్రూప్ సభ్యులు ఇదేమిటని ప్రశ్నించారు. మహిళా సంఘాల సభ్యులు మండిపడ్డారు.
ఈ వీడియోలపై ఆలస్యంగా మేల్కొన్న వినోద్ వెంటనే వాటిని డిలీట్ చేశారు. అప్పటికే తీసిన వాటి స్క్రీన్‌షాట్స్ గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వినోద్ ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు చెందిన మరో మొబైల్ ఫోన్ డ్రైవర్ వద్ద ఉంటదని, దీనిని తానెప్పుడూ ఉపయోగించలేదని వివరించారు. డ్రైవర్ పొరపాటుతో ఇది జరిగిందని, వైరల్ అయిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని దాటవేశారు.