Jeevan Reddy | ఇలా అయితే పార్టీలో మా పరిస్థితి ఏంటి.. కాంగ్రెస్‌పై మరోసారి జీవన్ రెడ్డి అసహనం
Jeevan Reddy | కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు.
Jeevan Reddy | కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏ పనులు అయినా సరే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే కట్టబెడుతున్నారని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను జీవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలను బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకే ఇచ్చారని పేర్కొన్నారు. పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులుగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే అనుచరుడికి ఇచ్చారని అన్నారు. దేవస్థాన చైర్మన్ పదవిని ఏమో కొప్పుల ఈశ్వర్ సహదారులకు కమిటీలో స్థానం కల్పించారని చెప్పారు. ఇలా అయితే పార్టీలో మా పరిస్థితి ఏంటి మంత్రి గారూ అని అడిగారు.
తాము రాహుల్‌గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అంటూ ముందుకు పోతున్నాం అని అన్నారు. తాము వలసదారులలాగా దోచుకొని దాచుకునే వారిమి కాదని.. కాంగ్రెస్ నాయకులమని తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులమని.. కౌలుదారులం కాదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Adluri Laxman
- BRS
- Congress
- Jagitial
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

