జాడ లేని జానారెడ్డి..
జానారెడ్డి | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబరచలేదు. ఇప్పటి వరకు తొమ్మిది రౌండ్లు పూర్తయినప్పటికీ.. ఏ

నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. రౌండ్ రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబరచలేదు. ఇప్పటి వరకు తొమ్మిది రౌండ్లు పూర్తయినప్పటికీ.. ఏ రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ముఖాలు చతికిల పడిపోయాయి. ఆ పార్టీ నాయకులందరూ విస్తృతంగా ప్రచారం చేసి, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ.. టీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ను సాగర్ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మరికాసేపట్లో సాగర్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది.
తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్లో టీఆర్ఎస్కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోలయ్యాయి. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు వచ్చాయి. ఎనిమిది రౌండ్లో టీఆర్ఎస్కు 3, 249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిదో రౌండ్లో టీఆర్ఎస్కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

