Ponnam vs Anjan Kumar Yadav | పొన్నం ప్రభాకర్ కంటే నేనే సీనియర్.. విరుచుకుపడ్డ అంజన్ కుమార్ యాదవ్
Ponnam vs Anjan Kumar Yadav | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్.. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సీరియస్ అయ్యారు.
Ponnam vs Anjan Kumar Yadav | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్.. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సీరియస్ అయ్యారు.
పొన్నం ప్రభాకర్ కంటే నేనే సీనియర్ అని ఆయనకు అంజన్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుంది.. పొన్నం ప్రభాకర్ కాదు అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎంతో మంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతి, కోమటిరెడ్డి బ్రదర్స్, మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఆయన అన్న మల్లు రవి ఎంపీ, వివేక్ మంత్రి, ఆయన కొడుకు ఎంపీ, ఆయన అన్న ఎమ్మెల్యే.. ఇలా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు.. నా కొడుకు ఎంపీ అయితే, నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు? అని కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ నిలదీశారు.
ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో తనకే టికెట్ వస్తుందని అంజన్ కుమార్ యాదవ్ ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా అంజన్ కుమార్ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఆయన అనుచరులు ఇంటింటికి తిరిగి అభ్యర్థి అంజన్ కుమార్ యాదవే అని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

