MLC Jeevan Reddy | చేర్చుకోవడాలు ఆగవ్.. తర్వాత మీ ఇష్టం.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అధిష్ఠానం ఝలక్
జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చివరకు మెత్తబడిపోయారు.
- పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్మున్షీతో భేటీ
- అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా, రాహుల్
- ఏదైనా ఉంటే సీఎంతో మాట్లాడుకోండన్న కేసీ
- రాజీనామా నిర్ణయం వెనక్కి: జీవన్‌రెడ్డి
MLC Jeevan Reddy | హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చివరకు మెత్తబడిపోయారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ సంకేతాలు ఇచ్చిన జీవన్‌రెడ్డి చివరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలోకి చేర్చుకున్న నేపథ్యంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి.. అధిష్ఠానం పిలుపు మేరకు బుధవారం ఢిల్లీ వెళ్లారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ ఉంటుందని భావించిన జీవన్‌రెడ్డికి అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది.
బుధవారం కనీసం వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. దీంతో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, కేసీ వేణుగోపాల్‌తో మాత్రమే సమావేశమయ్యారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన అనంతరం జీవన్‌రెడ్డి పూర్తిగా రాజీపడిపోయారు. మారుతున్న రాజకీయ పరిస్థితులతో సర్దుకుపోవడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతాయి. చేర్చుకోవడాలు ఆగవు. తర్వాత మీ ఇష్టం’ అని స్పష్టంచేసినట్టు సమాచారం. అయితే, ఎవరినైనా పార్టీలోకి తీసుకొనేటప్పుడు స్థానిక కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామని చెప్పారు.
జీవన్‌రెడ్డికి ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమ్రంతి రేవంత్‌రెడ్డితో మాట్లాడుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్టు తెలిసింది. అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. మొదటినుంచీ పార్టీలో ఉన్న నేతలకు తగిన గౌరవం ఇస్తామని, కార్యకర్తలను కాపాడుకుంటామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తప్పవని వ్యాఖ్యానించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి పనిచేస్తారా? అని మీడియా ప్రతినిధులు జీవన్‌రెడ్డిని ప్రశ్నించగా, అధిష్ఠానంతో కలిసి పనిచేస్తానని చెప్పడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

