Jagtial | రాత్రివేళ.. ఓవర్లోడ్ అయిందని మహిళలను బస్సు నుంచి దింపేసిన కండక్టర్
రాత్రి వేళ బస్సెక్కిన ఓ పదిమంది మహిళలను ఆర్టీసీ కండక్టర్ ఓవర్ లోడ్ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్యలో వదిలి వెళ్లాడు. ఈ ఘటన గురువారం రాత్రి జగిత్యాలలో చోటుచేసుకున్నది. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆర్టీసీ బస్సు రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి బయలుదేరింది.
- ఓవర్లోడ్ పేరిట దారి మధ్యలో వదిలేసిన వైనం
- ఇబ్బందులుపడ్డ పది మంది మహిళలు
Jagtial | జగిత్యాల, మార్చి 21 : రాత్రి వేళ బస్సెక్కిన ఓ పదిమంది మహిళలను ఆర్టీసీ కండక్టర్ ఓవర్ లోడ్ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్యలో వదిలి వెళ్లాడు. ఈ ఘటన గురువారం రాత్రి జగిత్యాలలో చోటుచేసుకున్నది. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆర్టీసీ బస్సు రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి బయలుదేరింది. బస్సు ఓవర్ లోడ్ అయిందని, టికెట్లు ఇచ్చే మెషీన్లో చార్జింగ్ లేదని, మెషీన్ నుంచి టికెట్లు రావడం లేదన్న సాకుతూ రూరల్ మండలంలోని తిమ్మాపూర్ శివారులో గల నల్లగుట్ట వద్ద పదిమంది మహిళలను కండక్టర్ దింపేశాడు.
దీంతో మహిళా ప్రయాణికులు ముందుకు, వెనక్కి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తిమ్మాపూర్ క్రాస్ రోడ్డులోని గ్రామస్థులు ధర్మారం వైపు వెళ్తున్న చివరి బస్సును ఆపి వారిని ఎక్కించారు. ఆ బస్సులోనూ ఓవర్లోడ్ ఉన్నదని కండకర్టర్ చెప్పగా, గ్రామస్థులు బతిమిలాడి బస్సు ఎక్కించి మహిళలను గమ్య స్థానాలకు దించాలని వేడుకున్నారు. ఈ విషయమై డీఎం సునీతను సంప్రదించగా స్పందించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

