Condom in Beer | సిద్దిపేట జిల్లాలో ఓ మందుబాబుకు షాకింగ్ ఘటన ఎదురైంది. వేసవికాలంలో చల్లగా బీర్ తాగుతుంటే.. ఆ బాటిల్లో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా కలకలం రేపింది.
భూంపల్లి ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి మంగళవారం నాడు వైన్స్‌కు వెళ్లి కింగ్‌ఫిషర్ బీర్ కొనుగోలు చేశాడు. అయితే బీర్ తాగడానికి చూస్తున్న టైమ్‌లో బాటిల్లో ఏదో తేలుతున్నట్లు కనిపించింది. దీంతో ఏంటని పరిశీలించగా అందులో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. దీంతో కంగుతిన్న కస్టమర్ వెంటనే వైన్స్‌కి వెళ్లి నిలదీశాడు. కానీ వైన్స్ నిర్వాహకులు సరిగ్గా స్పందించలేదు. దీంతో బీర్ బాటిల్‌ను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది.
కాగా, ఇదే వైన్స్‌లో గతంలో బీర్ కొనుగోలు చేస్తే.. అందులో నీళ్లు తప్ప ఏమీ లేదని వాపోయాడు. ఇదే ఘటనపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వైన్స్ వద్దకు చేరుకున్న ఎక్సైజ్ అధికారులు దీనిపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. బీర్ బాటిల్లోకి ఆ ప్యాకెట్ ఎలా వచ్చింది? తయారీ సమయంలో నిర్లక్ష్యమా? లేదా ఎవరైనా కావాలనే ఇలా చేశారా అనే కోణంలో విచారణ చేపడుతున్నామని చెప్పారు.
బీర్ బాటిల్లో కండోమ్ ప్యాకెట్ కలకలం
సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లిలోని ఓ వైన్స్ షాపులో తాను కొన్న కింగ్ ఫిషర్ బీర్ బాటిల్లో ఖాళీ కండోమ్ ప్యాకెట్ చూసి ఆశ్చర్య పోయిన వ్యక్తి
ఇదేంటని నిలదీయగా వైన్స్ షాప్ నిర్వాహకులు స్పందించలేదని షాప్ ముందు ఆందోళనకు దిగిన వినియోగదారులు… pic.twitter.com/dsYtybPXWv
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2026