TG DSC | మొదటి ర్యాంక్ వచ్చినా ఉద్యోగం లేదు.. డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో చిత్రవిచిత్రాలు
TG DSC | ఓ వైపు టీచర్ల నియామక పత్రాలు అందించబోతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.. మరోవైపు అదే నియామకాల ప్రక్రియలో మెరిట్ ఉన్నా ఉద్యోగాలు రాలేదని డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
TG DSC | సిటీబ్యూరో, అక్టోబర్ 8 ( నమస్తే తెలంగాణ ): ఓ వైపు టీచర్ల నియామక పత్రాలు అందించబోతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.. మరోవైపు అదే నియామకాల ప్రక్రియలో మెరిట్ ఉన్నా ఉద్యోగాలు రాలేదని డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మొదటి ర్యాంకు సాధించినా అర్హులుకారని వెనక్కి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బోళ్ల రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి నాన్ లోకల్ కింద ఎస్.ఏ సోషల్ తెలుగు మీడియంలో మొదటి ర్యాంకు సాధించాడు. అన్ రిజర్వ్డ్ పోస్టులో అతడికి కేటాయించాల్సిన ఉద్యోగాన్ని మరొకరికి కేటాయించారని హైదరాబాద్ విద్యాశాఖ అధికారి రోహిణికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇలా చాలా మంది తమకు అన్యాయం జరిగిందని డీఈవోకు దరఖాస్తుల రూపంలో మొరపెట్టుకున్నారు.
ఇన్‌సర్వీస్ తిప్పలు
హైదరాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు 616 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరికి బుధవారం ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారు. హైదరాబాద్‌లో 878 పోస్టులకుగాను 262 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉంది. ఉర్దూ మీడియం రిజర్వేషన్ కేటగిరిలో అభ్యర్థులు లేకపోవడంతో పోస్టులు పెండింగ్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇన్‌సర్వీస్‌లో ఉండి సెలవులు పెట్టకుండానే బీఈడీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 8మంది అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పడినట్టు తెలిసింది. దీంతో సదరు అభ్యర్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. పరీక్షల విభాగం ముందుగానే తమను నిరాకరించాల్సిందని.. పరీక్షకు అనుమతించి ర్యాంకు వచ్చాక ఇప్పుడు ఇన్‌సర్వీస్ అని ఇబ్బందులు సృష్టించడం సరైనది కాదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నారాయణపేటలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు మంగళవారం నారాయణపేటలోని డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన డీఈవోను సస్పెండ్ చేయాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు.
– నారాయణపేట రూరల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

