హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అనుమతి లేకుండా నడుస్తున్న ఇంటర్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త మాచర్ల రామకృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఇంటర్‌బోర్డు కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాదాపూర్ మిలానో బ్రాంచిలో చేరిన విద్యార్థులను మెహిదీపట్నంలోని బ్రాంచ్ కింద చూపిస్తున్నారని ఆరోపించారు. మిలానో, లక్ష్మీ ఎలైట్, సీసీకే, పీఎస్ఆర్, అర్జున హైట్స్ వంటి బ్రాంచీలు అనుమతి లేకుండా నడుస్తున్నాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.