పనులు వేగంగా పూర్తి చేయాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
పనులు వేగంగా పూర్తి చేయాలి | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో అత్యధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో అత్యధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యధునాతన టెక్నాలజీతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పొలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
దృఢ సంకల్పంతో నిర్మిస్తున్న ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. 60 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీ షాపూర్ పల్లోన్జీ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు నెమ్మదించినందున ఇప్పడు రెట్టింపు సంఖ్యలో కార్మికులను వినియోగించి వేగం పెంచాలన్నారు. కచ్చితంగా మూడు షిప్టులల్లో 24 గంటలు నిరంతరాయంగా వేగంగా పనులు జరిగేలా చూడాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. నిర్మాణ పనులను వారానికి ఒకసారి ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

