దశాబ్దంలోనే అత్యంత చలిరోజు
Hyderabad | హైదరాబాద్‌లో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో 2015 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో అతితక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు, మొయినాబాద్ మండలం రెడ్డిపల్లెలో 7.1 డిగ్రీలు, జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామంలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినట్టు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- cool weather
- Hyderabad
- IMD
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

