రాష్ట్రంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. కోహిర్లో 4.6 డిగ్రీలు
Cold | రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. మంచుదుప్పటి కప్పేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.
హైదరాబాద్: రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. మంచుదుప్పటి కప్పేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 4.6 డిగ్రీల సెల్సీయస్ నమోదయింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 4.7, సంగారెడ్డి జిల్లాలోని నల్లవల్లిలో 5.7, న్యాల్కల్లో 5.9 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 7.5 డిగ్రీలు, మెదక్ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్‌లలో 8 డిగ్రీ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్ల రాబోయే రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులపాటు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని, వారం తర్వాత మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే మూడు రోజుల వరకు గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cold
- Cold waves
- Kohir
- Nallavalli
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

