కాళేశ్వరం మూడో టీఎంసీపై తొందరొద్దు
కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉన్నదని, ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర జలసంఘం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంతోపాటు డీపీఆర్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
- నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తేతెలంగాణ): కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉన్నదని, ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర జలసంఘం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంతోపాటు డీపీఆర్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో మంగళవారం నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఏదుల నుంచి డిండి, అచ్చంపేట పథకాలకు నీటిని అందించాలని చెప్పారు. ఈ రెండు పథకాలకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లాపూర్ నుంచి ఏదుల వరకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యానాథ్ దాస్, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

