పాలమూరు కాల్వల టెండర్లు రద్దు?
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం.
- 9 వేల కోట్ల పనులకు గతంలోటెండర్లు
- ఉద్దండాపూర్, కరివెన, వెంకటాద్రి కాల్వల నిర్మాణం
- వాటిని రద్దు చేసే యోచనలో సర్కారు
- తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆయకట్టు సాధించాలని లక్ష్యం
- నీటిపారుదల శాఖపై నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం. నేడు ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే టెండర్ల రద్దు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై, ప్రభుత్వ లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. తమ పరిధిలోని పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరుకావాలని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందించారు.
రూ.9 వేల కోట్ల పనులు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకంలో భాగంగా తాగు, సాగునీటిని అందించేందుకు ప్రధాన కాలువల నిర్మాణ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. పనులను 3 నెలల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టు పరిధిలో 1,226 గ్రామాలకు తాగునీరు అందించటం, 1,536 చెరువులను నింపడంతోపాటు 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉన్నది. అందుకోసం 915 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది.
వెంకటాద్రి రిజర్వాయర్ నుంచే ఆయకట్టు ప్రారంభం కానుండగా, సింహభాగం దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉద్దండాపూర్ రిజర్వాయర్ కింద ఉన్నది. అందుకు సంబంధించి కాలువల నిర్మాణానికి 15,515 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, అందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే పలు రిజర్వాయర్ల కింద కాలువ పనులను చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టాలి. 16.74 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఆ రిజర్వాయర్ నుంచి మొత్తం 149 కిలోమీటర్ల పొడవుతో హై లెవల్ కెనాల్‌ను, 28.96 కిలోమీటర్ల పొడవుతో లోవెల్ కెనాల్‌ను నిర్మించాల్సి ఉన్నది.
ఆ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.454.56 కోట్లతో చేపట్టాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించింది. లో లెవల్ కెనాల్ ద్వారా 16 వేల ఎకరాలకు, హైలెవల్ కెనాల్ ద్వారా 1.17 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటుగా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు కూడా అందాల్సి ఉన్నది. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 4.6 కిలోమీటర్ల పొడవుతో కుడి కాల్వ-1, 100 కిలోమీటర్ల పొడవుతో కుడికాల్వ- 2, 122 కిలోమీటర్ల పొడవుతో ఎడమ ప్రధాన కాల్వ, 90 కిలోమీటర్ల పొడవుతో మద్దూర్ కాల్వ, 24 కిలోమీటర్ల పొడవుతో హన్వాడ కాల్వ నిర్మించాలని నిర్ణయించారు.
అందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే సుమారు రూ.5,600 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో రిజర్వాయర్ నుంచి 122 కిలోమీటర్ల పొడవుతో వికారాబాద్ వరకు ఎడమకాల్వను తవ్వాల్సి ఉండగా, 3 ప్యాకేజీలుగా విభజించి రూ.1,469 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా పిలిచారు. కురుమూర్తిరాయ రిజర్వాయర్ నుంచి 103 కిలోమీటర్ల పొడవుతో హై లెవల్ ప్రధాన కాల్వను తవ్వాల్సి ఉండగా, దానికింద మొత్తంగా 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆ పనులకు సైతం టెండర్లను ఖరారు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టెండర్లన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
చిన్న ప్రాజెక్టులపైనే దృష్టి
కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల నిర్మాణంపై కంటే చిన్న ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్, ఐడీసీ లిఫ్ట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ఇదే విషయాన్ని అధికారులకు ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వగలిగే ప్రాజెక్టులు ఏమున్నాయి? 6 నెలలు, సంవత్సరం, రెండేండ్లలో పూర్తి చేయగలిగే ప్రాజెక్టులు ఏవి? ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల పురోగతి, అందులో ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి? కావాల్సిన నిధులు తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని ఆదేశించారు.
నేడు నిర్వహించనున్న సమావేశంలో ఆయా అంశాలపైన కూడా సమీక్షించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత సీజన్లో ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విడుదల, ఆయకట్టు అంశాలపైన కూడా సీఎం రేవంత్ సమీక్షించనున్నట్టు అధికారులు వెల్లడించారు. తొలుత ఆయా అంశాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులతో అన్ని అంశాలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

