Revanth Reddy | హైదరాబాద్ : ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక.. ప్రతిపక్ష పార్టీపై నిత్యం నోరు పారేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలన మీద పట్టులేకపోవడంతో.. నోరుందని మాటలతోనే పూట గడుపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయని రేవంత్ రెడ్డి.. రేపటి రోజున ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ.. ప్రతిపక్ష పార్టీపై ఆరోణలు చేస్తూ పాలనను నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రవీంద్ర భారతి వేదికగా జరిగిన మేడే వేడుకల్లో కార్మికుల సంక్షేమానికి ఏం చర్యలు తీసుకుంటామో చెప్పకుండా.. పాత పాటే పాడుతూ కేసీఆర్పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కార్మికులను ఆకర్షించేందుకు విఫల ప్రయత్నం చేశారు.
ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కార్మికులు సమ్మె ఆలోచన వీడాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది. ఆర్టీసీ కార్మికులు పంతాలు,పట్టింపులకు పోకండి.. ఏదైనా సమస్య ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చించండి.. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడుతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి. అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు. మీ కోసమే ఖర్చు చేస్తాం.. ఒక్కసారి ఆలోచించండి అని రేవంత్ అన్నారు.
ఇక కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమ్మెపోటు రాష్ట్రానికి నష్టం చేకూర్చుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. ప్రతిపక్ష పార్టీల వలలో పడొద్దు.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి.. నమ్ముకున్న మీకు అండగా ఉంటాను. ఉట్టి తెగి పడాలని మాజీ సీఎం రోజూ శాపనార్థాలు పెడుతున్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని మాజీ సీఎం గుర్తుంచుకోవాలి అంటూ కేసీఆర్పై రేవంత్ నోరు పారేసుకున్నారు.
ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులపై నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పారు రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల 6500 కోట్లు మిత్తి కడుతున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులకి 10 వేల కోట్లు మిత్తి కడుతున్నామని మరో అబద్ధం చెప్పారు రేవంత్ రెడ్డి. రైజింగ్ తెలంగాణను ఎవరన్నా ఆపాలని చూస్తే వాళ్ల కాళ్ళు, కండ్లు, చేతులు కాలిపోతాయంటూ రేవంత్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వారు.
రైజింగ్ తెలంగాణను ఎవరన్నా ఆపాలని చూస్తే వాళ్ల కాళ్ళు, కండ్లు, చేతులు కాలిపోతాయి – రేవంత్ రెడ్డి https://t.co/5EPmRRgz47 pic.twitter.com/fNntI78lsS
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2025