ప్రాణహిత ప్రాజెక్టు కాలువలపై పట్టింపేది?
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగిస్తామని ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు.
- యథేచ్ఛగా బండరాళ్లు, మొరం తరలింపు
చింతలమానేపల్లి, జూన్ 4: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగిస్తామని ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ప్రాజెక్టు కోసం తవ్విన కాలువలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. కాలువల వద్ద నుంచి బండరాళ్లు, మొరాన్ని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని కోట్లు ఖర్చయినా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి హామీకి భిన్నంగా పదిరోజుల నుంచి చింతలమానేపల్లి మండలంలోని లంబాడీహట్టి గ్రామం మీదుగా వెళ్తున్న ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కెనాల్‌కు ఇరువైపులా బండరాళ్లతోపాటు మొరాన్ని పొక్లెయినర్లతో తీస్తూ లారీల్లో యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇటీవల ఈ లారీలను గ్రామస్థులు అడ్డుకున్నారు.
ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాగజ్‌నగర్ మండలం వేంపల్లి వద్ద కుమ్రం భీం ప్రాజెక్టు కెనాల్ నిర్మాణానికి ఈ బండరాళ్లు తరలిస్తున్నామని, ఇందుకు అన్ని అనుమతులు ఉన్నాయని సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ సూపర్వైజర్ జంపన్న తెలిపారు. ఈ విషయమై చింతలమానేపల్లి తహసీల్దార్ నాగరాజును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆ యన అందుబాటులోకి రాలేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం అప్పటి కాంగ్రెస్ సర్కారు తమ భూములను సేకరించి, ప్రస్తుతం ప్రాజెక్టు కాలువలను పట్టించుకోకపోవడం ఏమిటని భూములిచ్చిన రైతులు ప్రశ్నిస్తున్నారు. బండరాళ్లు, మొరం తరలింపుతో కాలువ పక్కన ఉన్న భూములు చదునుగా మారుతున్నాయి. ఆ భూములను కొందరు రైతులు ఆక్రమిస్తూ పంటలు సాగు చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదని స్థానికులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

