CM Revanth Reddy | వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుదాం: సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
- వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ, స్టాంప్‌డ్యూటీ సవరణపై అధ్యయనం
- జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి
- మద్యం అక్రమ రవాణా నివారణకు చర్యలు
- ఆదాయం పెంచేందుకు పనిచేయాలి
- రాష్ట్ర బడ్జెట్ టార్గెట్లు కలిసి సాధించాలి
- సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
CM Revanth Reddy | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల విలువ, స్టాంపు డ్యూటీ సవరణపై చర్చించారు.
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో అన్నిచోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగినప్పటికీ, అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు. చాలాచోట్ల భూముల మారెట్ విలువకు, వాస్తవ క్రయ, విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. 2021లో అప్పటి ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచిందని చెప్పారు. ఇప్పటికీ చాలాచోట్ల భూముల మారెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉన్నదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మారెట్ విలువను సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ధరల సవరణకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి? వ్యవసాయ భూములు, ఖాళీస్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లలో.. వేటికి ఎంత సవరించాలి? అనేది శాస్త్రీయంగా నిర్ధారించాలని స్పష్టంచేశారు. రాష్ట్ర రాబడి పెంపుతోపాటు స్థిరాస్తి, నిర్మాణరంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మారెట్ ధరల సవరణ జరగాలని సూచించారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉన్నది? దీనిని తగ్గించాలా? పెంచాలా? అనేది కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటుచేయాలని ఆదేశించారు. ఇప్పటికే చాలాచోట్ల అద్దెభవనాల్లో కార్యాలయాలు కొనసాగుతున్నాయని, దీంతో రిజిస్ట్రేషన్లకు వచ్చేవారు చెట్ల కింద నిలబడాల్సి వస్తున్నదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పబ్లిక్ యుటిలిటీ కోసం సేకరించిన స్థలాలను గుర్తించి, కొన్నిచోట్ల అధునాతనంగా మాడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించాలని, అందుకు సన్నాహాలు చేయాలని సూచించారు.
సమన్వయంతో పనిచేయండి
గత ఏడాది ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర బడ్జెట్లో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలని సూచించారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠినచర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెంచేందుకు అధికారులు పకా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంసరణలు చేపట్టాలని, శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని, జీఎస్టీ వసూళ్లు పెంచేందుకు పకాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని సూచించారు.
జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నికచ్చిగా పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని హెచ్చరించారు. జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతికి తావు లేకుండా వ్యవహరించాలని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎకువగా జరిగినా.. లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సామాన్యులకు, చిన్నచిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని చెప్పారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

