Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి : హరీష్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఆపిందని, అందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాయాలని, రైతాంగానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఆపిందని, అందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాయాలని, రైతాంగానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలకు గత బడ్జెట్లో రూ.56 వేల కోట్లు
కేటాయించారని, కానీ ఇప్పుడు దాన్ని రూ.50 వేల కోట్లకు తగ్గించారని చెప్పారు.
ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో కేటాయింపులు పెంచి, మహిళలకు నెలకు రూ.2,500.. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇస్తారేమోనని తాము భావించామని అన్నారు. కానీ ప్రభుత్వం బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు కేటాయింపులు తగ్గించి అమలు చేస్తున్న పథకాలకు కూడా కోతపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఇక జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా భట్టి విక్రమార్క చెప్పారని, కానీ బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం అంతకంటే ఎక్కువగా ఉందని హరీష్‌రావు చెప్పారు.
రాష్ట్రంలో అవినీతి, అక్రమాల కారణంగా.. చేతగానీ పాలనవల్ల ఈసారి తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. ఈ ప్రభుత్వం ప్యూర్ మోడల్ అంటూ తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తోందని.. ఇది ప్యూర్ మోడల్ కాదని, చోర్ మోడల్ గోల్మాల్ మోడల్ అని విమర్శించారు. బడ్జెట్లో మొత్తం అబద్దాలే ఉన్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలంగాణ అంశంలో ఇన్ని అబద్ధాలు చెప్పలేదని హరీష్‌రావు విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదని అన్నారు. కనీసం జాబ్ క్యాలెండర్ గురించి ఏదైనా చెబుతారేమో అనుకుంటే అది కూడా లేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

