10 వేల కోట్లివ్వండి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
- మూసీ మురుగునీటి శుద్ధికి రూ.4వేల కోట్లు అందించండి
- ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ కోసం 6 వేల కోట్లివ్వండి
- ఓఎంసీలకు ముందుగానే గ్యాస్ సబ్సిడీకి అవకాశమివ్వండి
- పౌర సరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి
- కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్, మంత్రుల వినతులు
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీనదిని దేశంలో మరెకడా లేనివిధంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, హర్దీప్సింగ్పూరీ, ప్రహ్లాద్‌జోషితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
మూసీలో కలిసే మురుగునీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి జలాలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లో నింపే ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. జల్‌జీవన్‌మిషన్ కింద తెలంగాణకు నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఓఎంసీ చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువులశాఖ మంత్రి హర్దీప్సింగ్పూరీకి సీఎం విన్నవించారు. సమావేశంలో ఖమ్మం, జహీరాబాద్ ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, సురేశ్ షెటార్ తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ సభకు రండి
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ నేపథ్యంలో ఈ నెలాఖరున నిర్వహించతలపెట్టిన సభకు రావాలని కాంగ్రె స్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే, ప్రి యాంకను ఆహ్వానించినట్టు సమాచారం. సో మవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ బృందం ఆహ్వానించినట్టు తెలిసింది.
విస్తరణ, పీసీసీ ఊసే లేదు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ పెద్దలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర నేతలు బిజీగా ఉండటంతో పాటు ఆషాడమాసం కారణంగా రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై చర్చించలేదని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాక శ్రావణమాసంలోనే నిర్ణయం తీసుకు ందామని సీఎం అధిష్ఠానం ముందే చెప్పటంతో వాటిని ప్రస్తావించలేదని తెలిసిం ది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అ ధ్యక్షుడి ఎంపికపై సీఎం తన అభిప్రాయాన్ని అధిష్ఠాన పెద్దలకు తెలియజేయటంతో నిర్ణయాన్ని వారికే వదిలేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

