కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది
రాష్ట్రంలో పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగార్థులకు మళ్లీ కోచింగ్ ఇవ్వడం ద్వారా ఒక్కో సెంటర్‌కు రూ.100 కోట్ల లాభాలు వస్తాయని ఆ సెంటర్లు ఆశపడుతున్నాయని చెప్పారు.
- పరీక్షలు వాయిదా పడితే ఒక్కో ఇన్స్టిట్యూట్కు రూ.100 కోట్ల ఆదాయం
- కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు
- ప్రతి తలమాసినోడు డీఎస్సీ వాయిదా అంటున్నడు
- నిరాహారదీక్షల్లో కేటీఆర్, హరీశ్ ఎందుకు లేరు?
- పరీక్షల వాయిదాతో ప్రభుత్వానికే లాభం
- 1:100 నిష్పత్తిలో ఇస్తే వాళ్లే కోర్టుకు వెళ్తారు
- మేమొచ్చిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలిచ్చాం
- బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర
- స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తాం
- మహబూబ్‌నగర్ కాంగ్రెస్ భేటీలో సీఎం రేవంత్
మహబూబ్‌నగర్, జూలై 9: రాష్ట్రంలో పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగార్థులకు మళ్లీ కోచింగ్ ఇవ్వడం ద్వారా ఒక్కో సెంటర్‌కు రూ.100 కోట్ల లాభాలు వస్తాయని ఆ సెంటర్లు ఆశపడుతున్నాయని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఏఎస్ఎన్ గార్డెన్స్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
పరీక్షలు వాయిదా పడటం వల్ల లాభమే తప్ప ప్రభుత్వానికి పోయేదేమీ ఉండదని, అభ్యర్థులకే నష్టమని అన్నారు. కోచింగ్ సెంటర్ల వారు పరీక్షలు వాయిదా వేయాలని తన వద్దకు పైరవీలు చేస్తున్నారని తెలిపారు. పరీక్షలు వాయిదా వేయించేందుకే కిరాయి మనుషులను పెట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి తలమాసినోడు వచ్చి డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలు వాయిదా వేడం లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగుల బలహీనతను వ్యాపారంగా మలచుకోవాలనే ఉద్దేశంతోనే ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు.
విద్యార్థులను రెచ్చగొట్టి నిరుద్యోగి మోతీలాల్‌తో ధర్నా చేయించారని ఆరోపించారు. నిరాహారదీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన అభ్యర్థులను కూర్చోబెట్టకుండా కేటీఆర్, హరీశ్‌రావు ఆమరణదీక్ష చేయాలని సవాల్ చేశారు. ‘పరీక్షలు వాయిదా అన్నా పడలి.. లేదా మా ప్రాణాలైనా పోవాలి’ అన్న నినాదంతో వారిద్దరూ ఆర్ట్స్ కాలేజీ ముందు దీక్షకు కూర్చుంటే రక్షణ కల్పిస్తామని చెప్పారు.
విద్యార్థుల మరణాలతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. గ్రూప్-1 మెయిన్‌కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే మళ్లీ కోర్టుకు వెళ్తారని, అప్పుడు కోర్టు నోటిఫికేషన్లో లేకుండా 1:100 నిష్పత్తిలో ఎలా పిలుస్తారని పరీక్షను రద్దు చేస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వచ్చిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. నిరుద్యోగ యువకులు సంయమనం పాటించాలని కోరారు.
కార్యకర్తలకు గుర్తింపునిస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కార్యకర్తలకే వచ్చే ఎన్నికల్లో నిలబడేందుకు అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తాను నాయకులకు నాయకుడిని కాదని, కార్యకర్తల్లో ఓ కార్యకర్తనని చెప్పారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అంతా అయిపోయినట్టు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లురవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం ప్రసంగిస్తుండగా కరెంట్ కట్
పాలమూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా 10 నిమిషాల తర్వాత 6:42 గంటల సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ అయ్యాయి. ఫంక్షన్హాల్లో ఉన్న జనరేటర్ సహాయంతో కార్యక్రమం కొనసాగింది. సీఎం వెళ్లిపోయాక విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడా నిమిషం కూడా కరెంట్ పోవడం లేదని సీఎం చెప్పారు.. కానీ ఆయన ప్రసంగంలోనే కరెంట్ పోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

