Rythu Runa Mafi | రుణమాఫీ వేదికల్లో గందరగోళం.. వీసీ ద్వారా సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన రైతులు
రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం రసాభాసగా మారింది. రుణమాఫీ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర జిల్లాల్లో గందరగోళ వాతావరణం నెలకొన్నది.
- చాలాచోట్ల రైతు వేదికలు వెలవెల
- సంబురాల్లోనూ కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు
- ఆందోళనల మధ్యనే ముగిసిన వీడియో కాన్ఫరెన్స్
Rythu Runa Mafi | నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, జూలై 18: రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం రసాభాసగా మారింది. రుణమాఫీ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర జిల్లాల్లో గందరగోళ వాతావరణం నెలకొన్నది.
వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలోని రైతు వేదికలో ఇద్దరు రైతులు పోటాపోటీగా మైక్ లాక్కొన్నారు. 2017లో రుణం తీసుకున్న రైతులు చేపట్టిన నిరసనలతో రైతు వేదిక దద్దరిల్లింది. 344 మంది లబ్ధిదారులకు కనీసం 50 మంది కూడా హాజరు కాలేదు. గుంట భూమి లేని నాయకులు కూడా కార్యక్రమానికి హాజరై కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినదించారు.
ఈ కాన్ఫరెన్స్‌కు మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు హాజరుకాలేదు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని జగిత్యాల జిల్లా కథలాపూర్, పెద్దపల్లి జిల్లా ఓదెల, జూలపల్లి మండలం తేలుకుంటలోని రైతు వేదికలు రైతులు లేక బోసిపోయాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం, మంత్రులు మాట్లాడుతున్న సమయంలో కొన్ని నిమిషాలు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో రైతులు ఇబ్బందిపడ్డారు.
సంబురాల్లో వర్గపోరు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ కాంగ్రెస్‌లో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. రుణమాఫీ సంబురాల్లో కొందరు కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసేందుకు సిద్ధమవుతుండగా, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. తనకు చెప్పకుండా ఎవరు చేయమన్నారంటూ అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అయిత హిమవంతరెడ్డిపై మండిపడ్డారు.
చెన్నారావుపేట కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రగడ
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఫ్లెక్సీల రగడ రాజుకున్నది. రుణ మాఫీ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెన్నారావుపేట రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో తమ ఫొటోలు పెట్టలేదని కొందరు, కింది వరుసలో పెట్టారని మరికొందరు బాహాటంగానే విమర్శలకు దిగారు.
యువకుడిపై కేసు
దిలావర్పూర్, జూలై 18 : రైతు రుణమాఫీపై రేవంత్‌రెడ్డి ప్రకటన చేస్తున్న సమయంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు చెందిన ఓ యువకుడు సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

