CM Revant Reddy | రైతు భరోసా ఎకరాకు రూ.12 వేలే.. సీఎం రేవంత్ రెడ్డి
CM Revant Reddy | ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద రూ.12 వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revant Reddy | అన్నదాతలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు మొండి చేయి చూపింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం తెలిపారు. 2023లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎకరానికి రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వానాకాలం, వేసంగి సీజన్లకు కలిపి ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద రూ.12 వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని అన్నారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరు పెట్టారు. జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.
మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా వర్తించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ భూములు సాగు చేసినా, చేయకపోయినా రైతు భరోసా వర్తిస్తుందని చెప్పారు. రైతు భరోసా అమలులో ఎటువంటి కోతల్లేవని, అందరికీ ఈ పథకం అమలవుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

