తెలంగాణ సుభిక్షానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి : మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మహబూబాబాద్ : తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజులలో కేసీఆర్ దేశంలోనే గొప్ప నాయకుడవుతారని అన్నారు.కురవి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఐదు కోట్ల రూపాయలను కేటాయించగా వీటితో 75 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది శివరాత్రి కల్లా పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు.
కురవి ప్రాంతాన్నిత్వరలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.ఈ ప్రాంతంలో హరిత హోటల్ ఏర్పాటుకు ప్రతిపాదనలను అధికారులకు అందించామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆమె శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, కురవి జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్ , జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, బీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, వల్లూరి కృష్ణారెడ్డి, నెహ్రు నాయక్, జీవన్ నాయక్, బొడ శ్రీను నాయక్, భద్రు, నాగన్న, డాక్టర్ సుందర్ నాయక్, బొమ్మకంటి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

